సరస్వతి లాంటి కథ చెప్పడానికి చాలా ధైర్యం కావాలి – శరత్ కుమార్

Sarath Kumar Calls Saraswati a Brave Cinematic Attempt

వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం’సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ డైరెక్టర్, వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకి విచ్చేసిన స్వప్న దత్ గారికి నందిని గారికి సిమ్రన్ గారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. బాలయ్య గారికి నాని గారికి, అడివి శే గారికి, ష్ సమంత గారికి, నయనతార గారికి, గోపి గారికి, బన్నీ వాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, నటీనటులకు పేరుపేరునా కృతజ్ఞతలు. తమన్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా నటీనటులు లేకపోతే సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది .ప్రకాష్ రాజ్ గారు, ప్రియమణి గారు నా విజన్ ని మరో స్థాయికి తీసుకువెళ్లారు. తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఇందులో ప్రతి పాత్ర కూడా చాలా అర్థవంతంగా ఉంటుంది.

హీరో శరత్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇక్కడ విమెన్ పవర్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఒక నటిగా వరలక్ష్మీ విజయంలో నా పాత్ర ఏమీ లేదు. కాకపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని. సరస్వతి లాంటి కథ ఖచ్చితంగా చెప్పాలి. స్త్రీలని గౌరవించడం మనందరి కర్తవ్యం. పూజకి చాలా మంచి ప్రొడక్షన్స్ స్కిల్స్ ఉన్నాయి. సరస్వతిలో కొన్ని క్లిప్స్ చూశా.ను చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. వరలక్ష్మి పూజ టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఇందులో మంచి టెక్నీషియన్స్ పనిచేశారు. తమన్ గొప్ప మ్యూజిక్ ఇచ్చారు. అలాగే కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. అంతిమంగా ప్రేక్షకులే నిర్ణయితలు. తప్పకుండా ఈ సినిమాకి వాళ్ళు చాలా మంచి తీర్పు ఇస్తారని నమ్ముతున్నాను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.