సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ క్లైమాక్స్ షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ హాట్ టాపిక్ అవుతుంది. కేవలం ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాల కోసమే ఏకంగా ₹20 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట. ఒక చిన్న సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ మొత్తాన్ని కేవలం ముగింపు సీన్ల కోసమే కేటాయించడం ఈ చిత్రం యొక్క భారీతనాన్ని తెలియజేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఫైనల్ వార్ సీక్వెన్స్‌ను దాదాపు 35 రోజుల పాటు సుదీర్ఘంగా చిత్రీకరించనున్నారు. ఇందులో సుమారు 18 యాక్షన్ బ్లాక్స్ ఉంటాయని, ప్రతి బ్లాక్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది.అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఫైట్ మాస్టర్ కెవిన్ ఈ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారు. ఈ పోరాట దృశ్యాలు ఆధునిక కురుక్షేత్రం తరహాలో, వెండితెరపై ఒక యుద్ధంలా కనిపించనున్నాయని సమాచారం.
రోహిత్ కేపీ దర్శకత్వంలో పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి దుర్గా తేజ్ మునుపెన్నడూ చూడని ఒక మాస్ అవతారంలో కనిపించబోతున్నారు.ఇందులో ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తుండగా జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తుండగా 100కోట్లకుపైగా బడ్జెట్ తో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. కుదిరితే ఈసినిమాను ఈ వేసవి లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



































