గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ఓవర్సీస్ బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన నార్త్ అమెరికా పంపిణీ హక్కులను ప్రముఖ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ భారీ ధరకు దక్కించుకుంది. ఈ డీల్ విలువ దాదాపు 9.5 మిలియన్ డాలర్లు (సుమారు ₹80 కోట్లు) అని ట్రేడ్ వర్గాల సమాచారం.ఈ చిత్రాన్ని అమెరికాలో ఏప్రిల్ 29న గ్రాండ్‌గా ప్రీమియర్ షోల ద్వారా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్ 30, 2026న థియేటర్లలోకి రాబోతోంది.
ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ “రై రై రారా”మార్చి 2న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘చికిరి చికిరి’ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు , దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక రగ్గడ్ మాస్ లుక్‌లో ఈ సినిమాలో కనిపించబోతున్నారు.ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























