శ్రీనివాస మంగాపురం నుండి మోహన్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్

Mohan Babu First Look from Srinivasa Mangapuram Released

మంగళవారం తరువాత డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. ఇక ఈసినిమాలో విలక్షణ నటుడు మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈరోజు ఈసినిమానుండి అయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో మోహన్ బాబు “వెంకటప్పయ్య నాయుడు” అనే గంభీరమైన పాత్రలో నటిస్తున్నారు. నేడు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మోహన్ బాబు తెల్లటి కుర్తా-ధోతీ ధరించి, రాజసంతో నడిచి వస్తున్న లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

గర్వం మరియు అధికారానికి నిలువుటద్దంలా ఉండే ఒక పల్లెటూరి పెద్ద పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. ఆయన వెనుక తుపాకులు పట్టుకున్న మనుషులు ఉండటం చూస్తుంటే, ఇది పూర్తిస్థాయి ఇంటెన్స్ డ్రామా అని అర్థమవుతోంది.

ఈ చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని (రమేష్ బాబు కుమారుడు) హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని హీరోయిన్‌గా నటిస్తోంది.జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, అశ్వినీదత్ మరియు జెమిని కిరణ్ సమర్పణలో పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని మే 31న సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.