శ్రీవిష్ణు మరియు రెబా మోనికా జాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు రాజమౌళి వంటి ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కగా, ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్‌ను రేపు విడుదల చేయబోతున్నారు.ఈ ట్రైలర్ ను టాలీవుడ్ స్టార్ హీరో రిలీజ్ చేయనున్నారు.ఆ హీరో పేరు రివీల్ చేయలేదు కానీ ఎవరో గెస్ చేయండి అంటూ షాడో ఫొటో తో వున్న పోస్టర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా తొలుత ఫిబ్రవరి 27నే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, శ్రీవిష్ణు నటించిన మరో చిత్రం ‘విష్ణు విన్యాసం’ కూడా అదే సమయంలో వస్తుండటంతో క్లాష్ నివారించడానికి మార్చి 6, 2026కి వాయిదా వేశారు.
హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీవిష్ణు ఒక మర్డర్ మిస్టరీని ఛేదించే పాత్రలో కనిపిస్తున్నారు. రెబా మోనికా జాన్ ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటించింది.కాల భైరవ ఈ చిత్రానికి బాణీలు సమకూర్చారు. లైట్ బాక్స్ మీడియా మరియు పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.శ్రీవిష్ణు కామెడీ సినిమాల నుండి రూటు మార్చి చేస్తున్న ఈ సీరియస్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































