ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘స్పిరిట్’ నుండి విలన్ పాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పవర్ఫుల్ విలన్‌గా నటిస్తున్నారు.గతంలో ఈసినిమా కోసం ఓ కొరియన్ యాక్టర్ విలన్ గా తీసుకున్నట్లు తెగ ప్రచారం జరిగింది. అయితే ఆ రూమర్స్ కి తెర దించుతూ మేకర్స్ ఈ రోజు విలన్ ఎవరో అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదలైన పోస్టర్లో వివేక్ ఒబెరాయ్ చేతిలో కత్తి పట్టుకుని, స్టైలిష్ గ్లాసెస్ మరియు సిగార్ తాగుతూ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు.ఈ చిత్రం మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.
టీ -సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ పోస్టర్ ద్వారా సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతో పాటు జపనీస్, కొరియన్ వంటి అంతర్జాతీయ భాషల్లో కూడా విడుదల కానుంది.
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల తర్వాత సందీప్ రెడ్డి వంగా నుండి వస్తున్న సినిమా కావడంతో, ఇందులో విలన్ పాత్ర ఎంత వైల్డ్‌గా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా చర్చిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































