నాగబంధం టీజర్ రివ్యూ: టాలీవుడ్‌లో మరో విజువల్ వండర్

Nagabandham Teaser Promises a Visual Spectacle

యంగ్ హీరో విరాట్ కర్ణ నటించిన పాన్-ఇండియా చిత్రం ‘నాగబంధం – ద సీక్రెట్ ట్రెజర్’.ఇక ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. అభిషేక్ నామ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విజువల్స్ పరంగా హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉంది. టీజర్ చూస్తుంటే గ్రాఫిక్స్ కోసం మేకర్స్ ఎంత శ్రమించారో అర్థమవుతుంది. ముఖ్యంగా పురాతన దేవాలయాలు, భారీ నాగుపాము, మరియు మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్లు కంటికి ఇంపుగా ఉన్నాయి. టీజర్ ప్రారంభం నుండి చివరి వరకు VFX పనితనం ఎక్కడా రాజీ పడకుండా, సినిమా స్థాయిని పెంచేలా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుమారు ₹100 కోట్ల అంచనా బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం. కేవలం ఒక క్లైమాక్స్ సీక్వెన్స్ కోసమే ఏకంగా ₹20 కోట్లు ఖర్చు చేశారంటే ఈ చిత్రం ఎంత భారీగా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. అలాగే అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని పోలి ఉండే భారీ సెట్‌ను రామానాయుడు స్టూడియోస్‌లో నిర్మించారు. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ ,నాబా నటేష్ , అనసూయ , జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు 

ఇక దర్శకుడు అభిషేక్ నామ గతంలో ‘డెవిల్’ సినిమాతో తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పుడు ‘నాగబంధం’తో పూర్తిస్థాయి మైథలాజికల్ యాక్షన్ డ్రామాను ఎంచుకున్నారు. పురాతన కాలపు మిస్టరీలను నేటి తరానికి ఆసక్తికరంగా చెప్పడంలో ఆయన విజన్ టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 1750 కాలం నాటి కథను విజువల్ వండర్‌గా మలచడంలో ఆయన దర్శకత్వ ప్రతిభ కనబడుతోంది.

‘పెదకాపు’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కర్ణ, ఈ చిత్రంలో ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. టీజర్‌లో ఆయన మేకోవర్ మరియు ‘శివుడి’ గెటప్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. యాక్షన్ సన్నివేశాల్లో మరియు కళ్ళతో పలికించే హావభావాల్లో విరాట్ ఎంతో పరిణతి చెందిన నటుడిగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఆయన కెరీర్‌కు ఒక పెద్ద మలుపు అయ్యేలా కనిపిస్తోంది.విజువల్ ఎఫెక్ట్స్, భారీ బడ్జెట్ మరియు దర్శకుడు అభిషేక్ నామ విజన్ చూస్తుంటే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వండర్స్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.కిషోర్ అన్నపురెడ్డి , నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈసినిమా ఈ సమ్మర్ లో థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.