ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

nagabandham teaser tops youtube trending list

దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “నాగబంధం” పాన్-ఇండియా స్థాయిలో భారీ సంచలనం సృష్టిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ మిస్టికల్ ఎపిక్ టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే 20 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి, దేశవ్యాప్తంగా ట్రెండింగ్ చార్ట్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం ద్వారా పాన్-ఇండియన్ లో అదరగొట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ అచీవ్మెంట్ ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టేది డైరెక్టర్ అభిషేక్ నామా విజన్. అంతర్జాతీయ స్థాయి విజువల్ స్పెక్టకిల్‌ను అందించారు. ఆయనతో పాటు హీరో విరాట్ కర్ణా, డెబ్యుటెంట్ నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి కలిసి వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు.

టీజర్‌లో ప్రత్యేక హైలెట్ గా నిలిచింది విరాట్ కర్ణా ట్రాన్స్‌ఫర్మేషన్. తన గత ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా, శివుని అవతారంలా కనిపించడం, హై ఎనర్జీతో ఆయన చేసిన నటన ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

టెక్నికల్ గా “నాగబంధం” కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తోంది. హైఎండ్ VFXలు సహజంగా అనిపించేలా ఉండటం, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్ , అద్భుతమైన సినిమాటోగ్రఫీ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కథలో ఉన్న భారీ స్కేల్‌ను నిజ జీవిత అనుభూతిగా మార్చేందుకు నిర్మాతలు ఎలాంటి ఖర్చుకూ వెనుకాడలేదని స్పష్టంగా తెలుస్తోంది.

టీజర్ హైప్ నుంచి సమ్మర్ రిలీజ్ దిశగా ప్రయాణిస్తున్న ఈ చిత్రం చుట్టూ ఉన్న బజ్ రోజురోజుకీ పెరుగుతోంది. మోడరన్ స్టైల్‌లో పురాణ కథనాన్ని చూపిస్తూ, అభిషేక్ నామా, ఆయన టీమ్ ప్రేక్షకుల అంచనాలను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.