ఆకట్టుకున్న బ్యాండ్ మేళం స్పెషల్ గ్లింప్స్‌ రిలీజ్

Band Melam Valentine's Day Special Glimpse released

టాలీవుడ్ యంగ్ పెయిర్ హర్ష్ రోషన్ మరియు శ్రీదేవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘బ్యాండ్ మేళం’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ వాలెంటైన్స్ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొత్త దర్శకుడు సతీష్ జవ్వాజి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ గ్లింప్స్‌లో హీరో తన ప్రేమను వ్యక్తపరుస్తూ చెప్పిన ఎమోషనల్ డైలాగ్స్ ప్రేక్షకులను బాగా హత్తుకుంటున్నాయి. రొమాంటిక్ టోన్‌తో పాటు బలమైన భావోద్వేగ సన్నివేశాలు ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. గతంలో ‘కోర్ట్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట, మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది.

హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీగా వస్తున్న ఈసినిమాను కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్యలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం మార్చి 13, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

యువతను ఆకట్టుకునే రొమాన్స్‌తో పాటు హృదయాన్ని తాకే ఎమోషనల్ కంటెంట్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా వచ్చిన ఈ గ్లింప్స్ మార్చి విడుదలకి ముందు మంచి హైప్‌ను క్రియేట్ చేసింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.