యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ టీజర్ నేడు విడుదలయ్యింది. ఈ సినిమా కోసం నిఖిల్ తన బాడీ లాంగ్వేజ్‌ను, రూపాన్ని పూర్తిగా మార్చుకున్నారు. టీజర్‌లో ఆయన ఒక పవర్‌ఫుల్ వారియర్ లుక్‌లో కనిపిస్తూ శత్రువులను చీల్చి చెండాడటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఒక యోధుడిగా నిఖిల్ చేసిన కఠిన శ్రమ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజ్యాన్ని కాపాడే వీరుడిగా నిఖిల్ ఇందులో కనిపించనున్నాడు.రియలిస్టిక్ హిస్టారికల్ స్టోరీ తో తెరకెక్కుతున్న ఈసినిమా విజువల్స్ పరంగా హాలీవుడ్ స్థాయిలో ఉంది. బాహుబలి కెమెరామెన్ KK సెంథిల్ కుమార్ విజువల్స్, ‘కేజీఎఫ్’, ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
విజువల్స్ పరంగా ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉంది. బాహుబలి కెమెరామెన్ KK సెంథిల్ కుమార్ విజువల్స్, ‘కేజీఎఫ్’, ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
నిఖిల్‌కు జోడీగా సంయుక్త మీనన్, నాభా నటేష్ నటిస్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఈ వేసవిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది.నిఖిల్ ‘కార్తికేయ 2’తో సాధించిన నేషనల్ లెవల్ ఇమేజ్‌ను ఈ ‘స్వయంభు’ మరో మెట్టు ఎక్కించేలా కనిపిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























