ఓటీటీలోకి వచ్చేసిన మన శంకరవర ప్రసాద్ గారు

Mana Shankara Vara Prasad Garu Now Streaming on OTT

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయడానికి సిద్ధమైంది. థియేటర్లలో 375కోట్లకుపైగా వసూళ్లను సాధించి రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈసినిమా ఈరోజు నుండి జీ 5 లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ , మలయాళ , తమిళ, హిందీ , బెంగాలీ , మరాఠి లో కూడా అందుబాటులోకి వచ్చింది.సో థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మళ్ళీ చూడాలనుకునే వారు ఇప్పుడు తమ ఇంట్లోనే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను ఆస్వాదించవచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా కథాంశం విషయానికి వస్తే, ఎన్‌ఎస్‌ఏ ఆఫీసర్ శంకరవరప్రసాద్ తన విడిపోయిన కుటుంబాన్ని కలుసుకోవడానికి ఒక సామాన్యుడిలా వారి జీవితంలోకి ప్రవేశించి చేసే హంగామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిరంజీవి కామెడీ టైమింగ్, నయనతార నటన మరియు క్లైమాక్స్‌లో వెంకటేష్ మెరుపు లాంటి అతిథి పాత్ర ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు.

భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సాహు గారపాటి ,సుష్మిత కొణిదెల ఈసినిమాను నిర్మించారు. ఈసినిమా చిరు కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.