స్ట్రీమింగ్ లోకి అనగనగా ఒక రాజు

Anaganaga Oka Raju Now Streaming on netflix

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి భారీ చిత్రాల మధ్య విడుదలై, బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘనవిజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే, గౌరవపురం జమీందారు మనవడైన రాజు (నవీన్ పొలిశెట్టి) ఆస్తులన్నీ పోయినా, ఇంకా గొప్పలు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తుంటాడు. ఒకసారి తన బంధువుల ఇంట్లో అవమానం ఎదురైనప్పుడు, ప్రపంచం మొత్తం గుర్తుంచుకునేలా పెళ్లి చేసుకుంటానని సవాల్ చేస్తాడు. ఈ క్రమంలో భూపతి రాజు కుమార్తె చారులతను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.

అయితే, పెళ్లి తర్వాత చారులత ఇచ్చిన ఒక ఊహించని ట్విస్టుతో రాజు జీవితం మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత రాజు ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడటం, ఊరి ప్రజలు అతన్ని ఎందుకు దూరం పెట్టారు వంటి ఆసక్తికర అంశాలతో సినిమా సాగుతుంది. ఎక్కడా అసభ్యత లేకుండా, కుటుంబం అంతా కలిసి చూసేలా దర్శకుడు మారి ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించారు. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈసినిమాను నాగవంశీ , సాయి సౌజన్య నిర్మించారు. ఈసినిమాతో నవీన్ మొదటి సారి 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.