శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ నుండి అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రెబా మోనికా జాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదలైన పోస్టర్‌లో రెబా మోనికా జాన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ యూనిఫాంలో కనిపిస్తున్నారు.ఇందులో ఆమె ఐపీఎస్ ఆఫీసర్ గా సీతా పరశురాం అనే రోల్ లో కనిపించనుంది. ‘సామజవరగమన’ వంటి హిట్ తర్వాత శ్రీవిష్ణు – రెబా కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ జంటపై అంచనాలు భారీగా ఉన్నాయి.
శ్రీవిష్ణు ఈ సినిమాలో ‘మృత్యుంజయ్’ అనే టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఇది ఒక పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని పోస్టర్ వైబ్స్ తెలియజేస్తున్నాయి.
ఈ చిత్రానికి శ్రీ హుస్సేన్ షా కిరణ్ కథను అందించి దర్శకత్వం వహిస్తున్నారు. లైట్ బాక్స్ మీడియా మరియు పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























