నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘హనీ’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ‘మట్కా’, ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రాబోతోంది.ఇక ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ దేవత వాహనం పిల్లి.. ఆ పిల్లి మాయ ఎవరి దగ్గర ఉంటే వారికి అందరూ దాసోహం కావాల్సిందే” అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించింది. మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు మరియు మనిషి మెదడులోని చీకటి కోణాలను స్పృశిస్తూ సాగే ఒక ఇంటెన్స్ డ్రామా ఇది.
ఈ చిత్రంలో ఆనంద్ అనే పాత్రలో నవీన్ చంద్ర గతంలో ఎన్నడూ చూడని విధంగా కనిపిస్తున్నారు .ఇందులో దివ్య పిళ్లై , రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఓవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అజయ్ అరసాడ సంగీతం అందించగా, నాగేశ్ బానేల్ సినిమాటోగ్రఫీ అందించారు. టీజర్ , ట్రైలర్ తో ఈసినిమా విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేస్తుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ట్రైలర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఫిలిం మేకింగ్ ప్రాసెస్ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇది మౌత్ టాక్ తో నిలబడే సినిమా. మాకు ఉన్న బడ్జెట్లో థియేటర్స్ కి తీసుకొచ్చి ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఫిబ్రవరి 6న దయచేసి ఒకసారి థియేటర్ కి రండి. ఇది థియేటర్ కి చాలా బాగుంటుంది. దివి చాలా అద్భుతమైన నటి. తను తప్పకుండా పెద్ద స్టార్ అవుతుంది. దివ్య కూడా చాలా చక్కగా నటించింది. ఈ సినిమా వెంటాడుతూనే ఉంటుంది. ఇది ఆలోచన రేకెత్తించే సినిమా. డివోపి మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. ఇందులో ఉన్న పాప కూడా చాలా చక్కగా నటించింది. మట్కా సినిమా సమయంలో కరుణ కుమార్ గారితో చాలా దగ్గర ఆయను. ఈ కథకు ఆయన నన్ను ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. ఈ సమాజంలో ఆశ కోసం ప్రజలు ఏవేవో చేస్తున్నారు. ఇందులో ఒక డార్క్ సొసైటీని చూపించాము. ఈ కథ విన్న తర్వాత నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడే ఇలాంటి వాటికి మనం విక్టిమ్ అవుతాం. ఆనంద్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసిన కరుణ కుమార్ గారికి థాంక్యూ సో మచ్. మీరు ఈ సినిమాని ఆదరిస్తే ఇలాంటి కథలు మరిన్ని వస్తాయి. ఈ సినిమా చేసిన్నప్పుడు చాలా మ్యాడ్ నెస్ లో ఉన్నాను. చాలా ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ ఇది. ఈ సినిమా షూటింగ్లో ఒక సంఘటన జరిగింది. ఈ క్యారెక్టర్ ప్రభావం వల్ల ఒక వ్యక్తితో నేను దురుసుగా ప్రవర్తించాను. అయితే అది నేను కాదు. ఆ క్యారెక్టర్ అలా ప్రవర్తించింది. తప్పకుండా ఫిబ్రవరి 6న ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























