కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘పరాశక్తి’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అలరించడానికి సిద్ధంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.ఈ చిత్రం ఫిబ్రవరి 7, 2026 నుండి జీ5లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1960ల నాటి తమిళనాడులోని హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో సాగుతుంది. ఇందులో శివకార్తికేయన్ ఒక రైల్వే ఉద్యోగిగా, విప్లవకారుడిగా పవర్‌ఫుల్ పాత్రలో నటించారు.శ్రీలీల ఈ సినిమాతోనే తమిళంలోకి కథానాయికగా అడుగుపెట్టారు.
శివకార్తికేయన్, శ్రీలీల,అథర్వ మురళి, జయం రవి తదితరులు కీలక పాత్రలు పోషించగా, జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఆకాష్ భాస్కరన్ నిర్మించారు.థియేటర్లలో ఈ చిత్రం సుమారు రూ. 80-100 కోట్ల మధ్య వసూళ్లను సాధించింది. అయితే బ్రేక్ ఈవెన్ మాత్రమే కాలేక పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























