సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ విడుదలకు సిద్దమవుతుంది.ఈ ఈనేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయిపోయింది.తెలుగు రాష్ట్రాలకు గాను ఈసినిమా థియేట్రికల్ రైట్స్ ను యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని దక్కించుకున్నారు. దాదాపు 4.05కోట్లకు ఈ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.సినిమాగా బాగా రావడంతో సంతోష్ శోభన్ మార్కెట్ మించి ఎక్కవ ధర పెట్టి సినిమాను కొనుక్కున్నారు. ఇక ఓవర్సీస్ లో ఈసినిమాను సరిగమ సినిమాస్ విడుదలచేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యూవీ క్రియేషన్స్ సమర్పణలో, యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈసినిమాను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14, 2026న తెలుగు మరియు తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చెన్నై నేపథ్యంలో సాగే ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ. బైక్ పూలింగ్ ద్వారా కలిసిన ఇద్దరు వ్యక్తుల మధ్య పరిచయం ఎలా ప్రేమగా మారింది? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. ఇందులో యోగి బాబు, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు.ఆదిత్య రవీంద్రన్ అందించిన సంగీతం ఇప్పటికే యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో సంతోష్ శోభన్ ఒక మంచి కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని భావిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























