ఇంట్లో ఒప్పుకోకపోతే పారిపోయి పెళ్లి చేసుకుందామనుకున్నాం – కీర్తి సురేష్

We Thought of Eloping If Our Families Didn’t Agree says Keerthy Suresh

దక్షిణాది అగ్ర కథానాయిక కీర్తి సురేశ్‌ తన సుదీర్ఘ ప్రేమ ప్రయాణం మరియు వివాహానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2024లో తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తటిల్‌ని ఆమె ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కీర్తి సురేశ్‌ మరియు ఆంటోనీ దాదాపు 15 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్నారు.స్కూల్ డేస్ నుండి ప్రారంభమైన వీరి పరిచయం కాలక్రమేణా బలమైన బంధంగా మారింది.పెళ్లి విషయంలో మొదట్లో తమకు కొన్ని భయాలు ఉండేవని ఆమె తెలిపారు. తమ వివాహం అంత ఘనంగా జరుగుతుందని తాము అస్సలు అనుకోలేదని, ఒకానొక దశలో “మేం కచ్చితంగా పారిపోయి పెళ్లి చేసుకుంటాం” అని భావించినట్లు కీర్తి వెల్లడించారు.

అయితే, ఇరు కుటుంబాల అంగీకారంతో వారి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. తాళి కట్టే ఆ 30 సెకన్ల సమయంలో తమ 15 ఏళ్ల ప్రేమ ప్రయాణం కళ్ల ముందు కదలాడిందని, ఆ క్షణంలో తామిద్దరం ఎంతో భావోద్వేగానికి లోనై ఆనందభాష్పాలు రాల్చామని ఆమె గుర్తు చేసుకున్నారు. తన జీవితంలోనే అవి అత్యంత మధురమైన క్షణాలని ఆమె పేర్కొన్నారు.

ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో రౌడీ జనార్ధన సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.