సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వారణాసి రిలీజ్ డేట్ 

Varanasi Release Date Trends Online

అగ్ర  దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ విడుదల తేదీ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. వారణాసి నగరంలో ఈ సినిమా రిలీజ్ డేట్ బోర్డులు దర్శనమివ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వారణాసి నగరంలోని పలు ప్రాంతాల్లో ‘వారణాసి – ఏప్రిల్ 7, 2027న థియేటర్లలోకి’ అని రాసి ఉన్న భారీ హోర్డింగ్‌లు కనిపించాయి. నేరుగా వారణాసి నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టి, సినిమా టైటిల్‌తో మ్యాచ్ అయ్యేలా రిలీజ్ డేట్‌ను రాజమౌళి ఇలా రివీల్ చేశారని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ హోర్డింగ్‌లు ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారాయి.ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ కూడా ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా ప్రకటించారు.

ఈ సినిమాను 2027 ఉగాది పండుగ కానుకగా లేదా శ్రీరామనవమి (ఏప్రిల్ 9, 2027) సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు హోర్డింగ్‌లో కనిపించిన డేట్ కూడా ఏప్రిల్ 7, 2027 కావడంతో ఇదే అధికారిక తేదీ కావచ్చని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.అయితే ఇదే ఒకవేళ అఫిషియల్ రిలీజ్ డేట్ అయితే ఇంత కన్నా మంచి రిలీజ్ డేట్ ఉండదేమో. ఎందుకంటే ఉగాది తరువాత వీకెండ్ తరువాత అంబేద్కర్ జయంతి , శ్రీ రామనవమి హాలిడేస్, మళ్ళీ వీకెండ్ ఇలా ఏప్రిల్ 18వరకు మధ్యలో 5 రోజులు వర్కింగ్ డేస్ తప్పితే మిగతావన్నీ సెలవులు కావడంతో వారణాసి కి బిగ్ అడ్వాంటేజ్ కానుంది.

సాధారణంగా రాజమౌళి సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎంతో గ్రాండ్‌గా ఉంటాయి. ఇప్పుడు ఇలా సైలెంట్‌గా వారణాసిలో హోర్డింగ్‌లు పెట్టడం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గ్లోబల్ స్థాయిలో సుమారు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే 30 శాతానికి పైగా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.ఈరోజు నుండి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.