డెకాయిట్ షూటింగ్ పూర్తి చేసిన మృణాల్ ఠాకూర్ 

Mrunal Thakur Finishes Her Shoot for Dacoit

అడివి శేష్ మరియు మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను మృణాల్ ఠాకూర్ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా సెట్స్‌లో చిత్ర యూనిట్‌తో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మృణాల్ ఠాకూర్ ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ఫుల్ మరియు ఎమోషనల్ రోల్‌లో కనిపించబోతున్నారు. అడివి శేష్, మృణాల్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎస్.ఎస్. కార్తికేయ సమర్పణలో, అన్నపూర్ణ స్టూడియోస్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.ఇందులో ప్రముఖ నటులు అతుల్ కులకర్ణి , అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో కనిపించనుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

టీజర్ మరియు పోస్టర్లతో ఇప్పటికే భారీ అంచనాలను పెంచిన ‘డెకాయిట్’ ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 19వ తేదీన థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.