యంగ్ హీరో ఆది సాయికుమార్ గతేడాది చివర్లో ‘శంబాల’ చిత్రంతో కెరీర్‌లో చాలా ఏళ్ళ తరువాత సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఒక పురాతన ఆలయం చుట్టూ తిరిగే ఆధ్యాత్మిక మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ డివోషనల్ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. నేటి నుండే శంబాల ఆహాలో స్ట్రీమింగ్ ప్రారంభించింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం కేవలం ‘ఆహా గోల్డ్’ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన సాధారణ సబ్‌స్క్రైబర్లు ఈ సినిమా చూడాలంటే మరో 24 గంటలు వేచి చూడాల్సి ఉంటుంది, వీరికి రేపటి నుండి ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది.
దర్శకుడు యుగంధర్ ముని ఈ చిత్రాన్ని అద్భుతమైన సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించారు. ఆది సాయికుమార్ నటన మరియు చిత్రంలోని ఆధ్యాత్మిక అంశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సస్పెన్స్ మరియు థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఓటీటీలో శంబాల ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. మీరు గనుక ఆహా గోల్డ్ యూజర్ అయితే ఇప్పుడే ఈ మిస్టరీ థ్రిల్లర్‌ను వీక్షించవచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























