నవీన్ చంద్ర, దివ్య పిళ్ళై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘హనీ’ చిత్ర టీజర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘పలాస 1978’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాల తర్వాత దర్శకుడు కరుణ కుమార్ ఎంచుకున్న ఈ సైకలాజికల్ హారర్ కథాంశం వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. వాస్తవ సంఘటనల ఆధారంగా మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు మరియు డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాధారణ హారర్ చిత్రాలకు భిన్నంగా ఈ టీజర్ పూర్తిగా రిచువల్ బేస్డ్ (ఆచార సంబంధిత) హారర్‌ను పరిచయం చేస్తోంది. నిశ్శబ్దం, చీకటి, మర్మమైన చూపులు మరియు తెలియని శక్తుల కలయికతో ఒక మార్మిక ప్రపంచాన్ని ఈ టీజర్ ఆవిష్కరించింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఒక పెద్ద రహస్యం దాగి ఉందన్న భావనను కలిగిస్తూ, హారర్‌ను కేవలం భయపెట్టే అంశంగా కాకుండా ఊహకు అతీతంగా ప్రజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది.
నవీన్ చంద్ర తన స్టన్నింగ్ లుక్ మరియు పెర్ఫార్మెన్స్‌తో టీజర్‌కు ప్రాణం పోశారు. ఆయనతో పాటు దివి, రాజా రవీంద్ర పాత్రలు కూడా వైవిధ్యంగా కనిపిస్తున్నాయి. అజయ్ అరసాడ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ , నాగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ టీజర్ లో హైలైట్ అయ్యాయి.
ఓవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శేఖర్ స్టూడియోస్ సమర్పణలో ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవరాల్ గా టీజర్ తో సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు మేకర్స్. సోషల్ మీడియాలో కూడా టీజర్ రెస్పాన్స్ సూపర్ గా వుంది. టీజరే ఇలా ఉంటే సినిమా ఇంకెలా ఉంటుందో అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























