మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రం విడుదలైన ఏడవ రోజున తెలుగు రాష్ట్రాల్లో ‘ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్’ సృష్టించి సరికొత్త చరిత్ర లిఖించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తూ మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైన ఏడవ రోజున తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచి ఇండస్ట్రీ రికార్డును సొంతం చేసుకుంది.నిన్న ఒక్క రోజే తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా 12కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఇంతకుముందు అల .. వైకుంఠపురములో 7వ రోజు 8కోట్ల షేర్ ను రాబట్టి మొదటి స్థానంలో ఉండగా మన శంకరవరప్రసాద్ గారు ఆ రికార్డు ను బ్రేక్ చేసింది. అల… వైకుంఠపురములో కూడా సంక్రాంతి టైం లోనే రిలీజ్ అయ్యింది.
ఓవరాల్ గా మన శంకర ప్రసాద్ ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లో 140కోట్ల షేర్ రాబట్టుకోవడంతో ఇప్పటికే బయ్యర్లకు దాదాపు 20కోట్ల లాభాలను తీసుకొచ్చింది. సంక్రాంతి సెలవులు ముగిశాక కూడా ఈసినిమా జోరు తగ్గడం లేదు. ఈరోజు కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ బాగా ఉండడం తో లాంగ్ రన్ లో ఈసినిమా 350కోట్ల మార్క్ ను ఈజీగా క్రాస్ చేయనుంది.
భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, సాహు గారపాటి మరియు సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు.మెగాస్టార్ వింటేజ్ కామెడీ మరియు అనిల్ రావిపూడి మాస్ ఎంటర్టైన్మెంట్ తోడవ్వడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేటను కొనసాగిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























