ఆహా లోకి రానున్న శంబాల.. రిలీజ్ డేట్ ఫిక్స్

Shambhala to Premiere on Aha as Release Date Gets Locked

ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టిక్ థ్రిల్లర్ మూవీ ‘శంబాల’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలై 20కోట్ల వసూళ్లతో సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ దక్కించుకుంది. ఇక ఈ సినిమా జనవరి 22 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ‘ఆహా గోల్డ్’ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులకు ఒక రోజు ముందుగానే, అంటే జనవరి 21 నుండే ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా కథాంశం 1980వ దశకం నేపథ్యంలో సాగుతుంది. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ‘శంబాల’ అనే గ్రామంలో ఆకాశం నుండి ఒక ఉల్క పడటంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత ఆ ఊరిలో వరుసగా వింత సంఘటనలు, హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఆ ఊరి ప్రజలు ఇదంతా ఒక బండ భూతం వల్ల జరుగుతోందని భయపడతారు. ఈ రహస్యాలను ఛేదించేందుకు ప్రభుత్వం విక్రమ్ (ఆది సాయికుమార్) అనే యువ శాస్త్రవేత్తను అక్కడికి పంపిస్తుంది. సైన్స్‌ను నమ్మే విక్రమ్, ఆ ఊరిలో జరుగుతున్న వింతల వెనుక అసలు కారణాలను ఎలా కనుగొన్నాడు? మూఢ నమ్మకాలకు, సైన్స్‌కు మధ్య జరిగిన ఈ సంఘర్షణలో విక్రమ్ గెలిచాడా లేదా? అన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం.

యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. ఆది సాయికుమార్ తన కెరీర్‌లో చేసిన ఒక విభిన్నమైన ప్రయత్నంగా ఈ సినిమా గుర్తింపు పొందింది. అంతేకాదు ఈసినిమా తో చాలా ఏళ్ళ తరువాత విజయాన్ని అందుకొని ఫామ్ లోకి వచ్చాడు.థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈసినిమా ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి వ్యూస్ రాబట్టుకోనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.