మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మొదటి నాలుగు రోజుల్లోనే అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 190 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈరోజుతో ఈసినిమా 100 షేర్ మార్క్ ను చేరుకోనుంది. దాంతో చిరుకి ఇది నాలుగో 100 కోట్ల షేర్ మూవీ.అంతేకాదు ఆయన కెరీర్ లో అతి తక్కువ రోజుల్లో ఈమార్క్ చేరుకున్నమొదటి సినిమా కూడా ఇదే. సంక్రాంతి సెలవులు ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారాయి. మొదటి రోజు రూ. 84 కోట్ల గ్రాస్‌తో మొదలైన ఈ మెగా ప్రయాణం, రెండో రోజు రూ. 36 కోట్లు, మూడో రోజు రూ. 32 కోట్లు మరియు నాలుగో రోజు (గురువారం) రూ. 38 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. అమెరికాలో కూడా ఈ సినిమా 3 మిలియన్ డాలర్ల మార్కుకు చేరువలో ఉండటం విశేషం.
చిరంజీవి మార్కు కామెడీ మరియు అనిల్ రావిపూడి కమర్షియల్ హంగులు తోడవడంతో ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా వెంకటేష్ గెస్ట్ రోల్ మరియు నయనతార నటన సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి.రేపటి తో ఈసినిమా దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కానుంది. ప్రస్తుత జోరు చూస్తుంటే, ఈ వారాంతం ముగిసేసరికి ఈ చిత్రం రూ. 250 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.ఫుల్ రన్ లో ఈజీగా 300కోట్ల మార్క్ ను క్రాస్ చేసి చిరంజీవి కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























