తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ కెరీర్‌లో 25వ మైలురాయిగా వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పరాశక్తి’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సుధ కొంగర దర్శకత్వంలో పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘U/A’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. 1960ల నాటి హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో సాగే ఈ కథలో వివాదాస్పద అంశాలు ఉన్నాయనే కారణంతో సెన్సార్ బోర్డు తొలుత అనేక కత్తెర్లు (సుమారు 23 కంటే ఎక్కువ సీన్లు) సూచించింది. దాంతో నిన్నటి వరకు సినిమా చెప్పిన తేదికి విడుదలవుతుందాలేదనే అనుమానాలు రేకెత్తాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే, సినిమా కథాంశం దెబ్బతినకూడదని దర్శకురాలు సుధ కొంగర ముంబైలోని రివైజింగ్ కమిటీని ఆశ్రయించి, తన వాదనను బలంగా వినిపించారు. చివరికి కొన్ని మార్పులతో ఈ చిత్రం సెన్సార్ అడ్డంకులను అధిగమించి విడుదలకు మార్గం సుగమం చేసుకుంది ఈ సినిమా నిడివి సుమారు 162 నిమిషాలు (2 గంటల 42 నిమిషాలు) ఉండబోతోంది.
ఈ చిత్రంలో శివకార్తికేయన్ ఒక పవర్‌ఫుల్ విద్యార్థి నాయకుడి పాత్రలో నటించగా టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ఈ సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. జయం రవి, అథర్వ మురళి కీలక పాత్రల్లో కనిపించనుండగా రానా దగ్గుబాటి మరియు మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ అతిథి పాత్రల్లో మెరవనున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన 100వ సినిమా కావడం విశేషం.డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు, అంటే జనవరి 10, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.సెన్సార్ వివాదాల వల్ల సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.దానికి తోడు విజయ్ జన నాయగన్ సెన్సార్ కారణాల వల్ల విడుదల వాయిదా పడడంతో సోలో గా రిలీజ్ కానుండడం పరాశక్తికి అడ్వాంటేజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























