కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది.ఈ సంస్థ నుంచి వచ్చిన రెండు భారీ చిత్రాలు ‘కాంతార: చాప్టర్1’ అలాగే ‘మహావతార్ నరసింహ’ ప్రతిష్టాత్మక ఆస్కార్-2026 అవార్డుల రేసులో నిలిచాయి.ఒకే నిర్మాణ సంస్థ నుంచి రెండు సినిమాలు వేర్వేరు విభాగాల్లో ఆస్కార్ అర్హత సాధించడం భారతీయ సినిమా చరిత్రలో ఒక రికార్డుగా నిలిచింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించిన రిమైండర్ లిస్ట్‌లో ఈ రెండు చిత్రాలకు చోటు దక్కింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్ 1’ అక్టోబర్ లో విడుదలై 800కోట్ల వసూళ్లతో ఈఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండో భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది. గతంలో ‘కాంతార’ సినిమాతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన రిషబ్ శెట్టి ఇప్పుడు ఈ ప్రీక్వెల్‌తో ఆస్కార్ వేదికపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోవైపు అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘మహావతార్ నరసింహ’ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అర్హత సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ. 325 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన యానిమేటెడ్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు ఆస్కార్ బరిలో ‘జూటోపియా 2’, ‘డెమొన్ స్లేయర్’ వంటి ప్రపంచ స్థాయి చిత్రాలతో పోటీ పడుతుండటం విశేషం.కాంతార చాప్టర్ 1 , మహావతార్ నరసింహ కేవలం ఉత్తమ చిత్రం విభాగంలోనే కాకుండా ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ వంటి ప్రధాన కేటగిరీలన్నింటిలోనూ పోటీ పడనున్నాయి.
98వ అకాడమీ అవార్డుల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జనవరి 22న తుది జాబితాను విడుదల చేయనున్నారు. మార్చి 2026లో జరగబోయే ఈ వేడుకలో ఈ రెండు చిత్రాలు నామినేషన్లు దక్కించుకుంటే అది భారతీయ చలనచిత్ర రంగానికి గర్వకారణంగా నిలుస్తుంది. పురాణ గాథలు మరియు మట్టి మూలాల నేపథ్యంలో సాగే ఈ కథలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























