నాకు సినిమా తప్పా ఇంకో ప్రపంచం తెలీదు –   ఆది సాయి కుమార్ 

Aadi Sai Kumar Says Cinema Is the Only World He Knows

వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం శంబాల. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మంచు మనోజ్, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి, తమన్, అనిల్ రావిపూడి, నవీన్ యెర్నెని, టీజీ విశ్వ ప్రసాద్, అశ్విన్ బాబు, మైత్రి శశి వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ కార్యక్రమంలో..ఆది సాయి కుమార్ మాట్లాడుతూ .. శంబాల ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నా ఈ ప్రయాణంలో మీడియా, ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే వచ్చారు. గత ఏడాది డిసెంబర్‌లో శంబాల ఫస్ట్ పోస్టర్‌ నుంచి అందరూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. టీజర్‌ను దుల్కర్ గారు రిలీజ్ చేశారు. ప్రభాస్ గారు, నాని గారు రిలీజ్ చేసిన ట్రైలర్‌లు అంచనాల్ని పెంచేశాయి. యుగంధర్ ముని అద్భుతంగా తీశాడు కాబట్టే ఈ రోజు చిత్రంపై హైప్ ఏర్పడింది. దర్శక, నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని రూపొందించారు. బడ్జెట్ ఎక్కువ అయినా కూడా నిర్మాతలు మహీధర్ గారు, రాజశేఖర్ గారు వెనుకాడలేదు. ప్రవీణ్ విజువల్స్, శ్రీచరణ్ ఆర్ఆర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుంది. 

శంబాలలో అందరూ అద్భుతంగా నటించారు. థియేటర్లో అందరూ మా మూవీని చూసి సర్ ప్రైజ్ అవుతారు. ఈ చిత్రాన్ని అందరూ థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్‌‌ను ఎంజాయ్ చేస్తారు.నాకు సినిమా తప్పా ఇంకో ప్రపంచం తెలీదు. సాయి కుమార్ కొడుకుగా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. ఆయన కొడుకుని అని చెప్పుకోవడాన్ని గర్వంగా ఫీల్ అవుతాను. నేను హిట్టు కొట్టాలని ఆయన ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శంబాలతో మేం డిసెంబర్ 25న హిట్టు కొట్టబోతోన్నాం.క్రిస్మస్‌కి రిలీజ్ కాబోతోన్న అన్ని చిత్రాలు హిట్ అవ్వాలని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.