శంబాలతో ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం – సాయి కుమార్

Sai Kumar’s Speech at Shambhala Pre-Release Event

వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం శంబాల. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మంచు మనోజ్, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి, తమన్, అనిల్ రావిపూడి, నవీన్ యెర్నెని, టీజీ విశ్వ ప్రసాద్, అశ్విన్ బాబు, మైత్రి శశి వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ఈవెంట్ లో ..సాయి కుమార్ మాట్లాడుతూ .. మా అమ్మానాన్న గార్లతో మొదలైన సినీ ప్రయాణం ప్రేక్షకుల ఆదరణతో ఇంకా కొనసాగుతోంది. 1975లో నేను హీరోగా పరిచయం అయ్యాను. 2011లో ప్రేమ కావాలితో హీరోగా పరిచయం అయ్యారు. జయాపజయాలు అందరికీ సహజమే. కానీ ప్రయత్నం చేయడం మాత్రం ఎప్పుడూ ఆపలేదు. శంబాలతో ఆదికి విజయం దక్కబోతోంది. నిజంగానే మునిలా యుగంధర్ ఈ మూవీని రూపొందించారు. గత డిసెంబర్‌లో రిలీజ్ చేసిన పోస్టర్‌ నుంచి ఇప్పటి వరకు పాజిటివిటీ ఏర్పడుతూనే వచ్చింది.

దుల్కర్, ప్రభాస్, నాని ఇలా అందరూ ‘శంబాల’కు సపోర్ట్ చేశారు. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ ఆదరిస్తారు. కిరణ్ అబ్బవరం, అనిల్ రావిపూడి, ప్రియదర్శి ఇలా అందరూ నాకు ఫ్యామిలీ లాంటివారు. జయాపజయాలతో సంబంధం లేకుండా మా కోసం నిలబడిన అభిమానులకు థాంక్స్. అభిమానుల పేరు, నా పేరుని ఈ సారి ఆది నిలబెడతారు. మైత్రి శశి గారు ఈ మూవీని చూసి హిట్ అవుతుందని చెప్పడంతో కాస్త ఉపశమనం కలిగించింది. ఓవర్సీస్‌లో భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేయబోతోన్నారు. శంబాల డిసెంబర్ 25న కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ‘శంబాల’తో ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం, టీంకు విజయోత్సాహం రావాలని కోరుకుంటున్నానని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.