నారీ నారీ నడుమ మురారి టీజర్ రిలీజ్ 

Naari Naari Naduma Murari Teaser Released

శర్వానంద్ హీరోగా సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు  తెరకెక్కిస్తున్న సినిమా నారీ నారీ నడుమ మురారి.సంక్రాంతి కానుకగా  ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సినిమాపై అంచనాలు పెంచేలా ప్రమోషన్లు వేగవంతం చేశారు మేకర్స్. అందులో భాగంగా ఈరోజు టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈటీజర్ ఎంటర్టైనింగ్ గా ఉండి సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ప్రేమికుడిగా శర్వా వినోదం పంచనున్నాడు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని ఒక ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో శర్వానంద్ సరసన సాక్షి వైద్య మరియు సమ్యుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర  ఈసినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి సీజన్‌లో భారీ  పోటీ ఉన్నప్పటికీ, శర్వానంద్ తనదైన కామెడీ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో హిట్ కొట్టాలని చూస్తున్నారు.

శర్వానంద్ కు సంక్రాంతి సీజన్  బాగా కలిసొచ్చింది.దాంతో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని మేకర్స్  కాన్ఫిడెంట్ గా వున్నారు.జనవరి 14న సాయంత్రం నుండి  నారీ నారీ నడుమ మురారి ప్రీమియర్స్ పడనున్నాయి. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.