గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ 2: తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. ప్రీమియర్స్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ఒక వారం రోజులు వాయిదా పడింది. ఈ సందర్భంగా మా బాలయ్య బాబు గారికి, డైరెక్టర్ బోయపాటి శ్రీను గారికి, బాలయ్య బాబుగారి ఫ్యాన్స్‌కి మా ప్రొడక్షన్ తరఫున సారీ చెప్తున్నాం. ఈ సమస్యని పరిష్కరించడానికి మ్యాంగో మీడియా రామ్ గారు, నిర్మాత దిల్ రాజు గారు చాలా సపోర్ట్ చేశారు. వారికి ధన్యవాదాలు. ఒక వారం రోజులు ఆలస్యం అయినప్పటికీ డిసెంబర్ 12న ఈ సినిమా ప్రీమియర్స్‌తో రిలీజ్ అయింది. ఈ ప్రీమియర్స్‌కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది.”
“మేము భ్రమరాంబంలో చూసాం. ఫ్యాన్స్ అసలు సీట్లో కూర్చోవడం లేదు. నిలుచుని చప్పట్లు విజిల్స్‌తో అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. రిలీజ్ రోజు మార్నింగ్, మ్యాట్నీ షోలు కూడా అద్భుతంగా ఉన్నాయి. అన్ని ఏరియాల నుంచి మంచి కలెక్షన్స్, రిపోర్ట్స్ వస్తున్నాయి. నార్త్‌లో ‘జీ సినిమాస్’ ద్వారా దాదాపు 800 స్క్రీన్స్‌లో రిలీజ్ చేశాం. అక్కడ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమాకి వర్డ్ ఆఫ్ మౌత్ బ్రహ్మాండంగా ఉంది. సూపర్ ట్రెండ్‌లో టికెట్స్ బుక్ అవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ చేయాలని భావిస్తున్నాము.” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























