స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేశ్‌ల కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా టైటిల్‌ను తాజాగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ అనే క్లాస్ టైటిల్‌ను ఖరారు చేశారు. చిత్రబృందం ఈ సందర్భంగా వెంకటేశ్ ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసింది. ఫస్ట్ లుక్‌లో వెంకటేశ్ ఫ్యామిలీ మ్యాన్‌లా కనిపిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇన్నేళ్ల తర్వాత వీరి కలయికలో సినిమా వస్తుండడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక త్రివిక్రమ్ ఈసారి కూడా అ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. ఇంతకుముందు ఈసినిమాకోసం రకరాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. కానీ చివరికి ఊహించని టైటిల్ ను ఫిక్స్ చేశారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచే ప్రారంభం కాబోతోంది. వెంకటేశ్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేసి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























