నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అఖండ 2: తాండవం’ ఈనెల 5 న విడుదల కావాల్సిఉండగా చివరి నిమిషంలో అనివార్య పరిస్థితుల కారణంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అభిమానులు ఒకింత తీవ్ర నిరాశకు గురయ్యారు.ఆ తరువాత రిలీజ్ డేట్ గురించి రకరకాల వార్తలు రావడం తో మరింత ఆలస్యం కాకుండా సినిమాను ఈనెల 12నే విడుదలచేయాలని గత రెండు రోజులనుండి సోషల్ మీడియా వేదికగా పోరాడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందుకోసం #WeWantAkhanda2OnDec12th అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేశారు.ఇక వారి ఇష్టానికే నిర్మాతలు కూడా మొగ్గు చూపడంతో సినిమాను ఈనెల 12న రిలీజ్ చేయనున్నారు. ఈవిషయాన్ని కొద్దీ సేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు.
సంక్రాంతికి వరకు మేజర్ రిలీజ్ లేకపోవడం అలాగే క్రిస్మస్ , న్యూ ఇయర్ హాలిడేస్ ఉండడంతో అఖండ 2కి కలిసిరానుంది. ఎలాగూ భారీ క్రేజ్ ఉండడంతో కలెక్షన్ల పరంగా దుమ్ము రేపడం ఖాయం. బుక్ మై షో లో ఇంట్రెస్ట్స్ కూడా 3లక్షలు దాటాయి.మొదటి భాగం ‘అఖండ’ సాధించిన విజయం, ఈ సీక్వెల్ పై అంచనాలను ఆకాశానికి చేర్చింది.ఇక రిలీజ్ కి ముందు రోజు వాయిదాపడడం కూడా సినిమాకు అడ్వాంటేజ్ అయ్యింది.సినిమాకి వున్న హైప్ డబుల్ అయ్యింది. ఇక మిగిలిందల్లా హిట్ టాక్ రావడమే. తమన్ ఈసినిమాకు సంగీతం అందించగా 14 రీల్స్ ప్లస్ నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























