దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః.మలయాళంలో విజయవంతమైన ‘జయ జయ జయ జయ హే’ చిత్రానికి రీమేక్ గా వస్తుంది.రూరల్ కామెడీ-డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమా లో తరుణ్ భాస్కర్ అంబాటి ఓంకార్ నాయుడు అనే చేపల వ్యాపారి పాత్రలో, ఈషా రెబ్బా కొండవీటి ప్రశాంతి అనే సహనశీలి పాత్రలో నటించారు. బ్రహ్మాజీ, రోహిణి కీలక పాత్రల్లో కనిపిస్తారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నిన్న ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.గోదావరి జిల్లాల నేపథ్యంలో సహజమైన హాస్యం, డ్రామాతో కూడిన ఒక కుటుంబ కథా చిత్రంతో వస్తుంది. అహంకారం, స్వార్థం ఉన్న భర్త (తరుణ్ భాస్కర్), ఓర్పు, క్రమశిక్షణ ఉన్న భార్య (ఈషా రెబ్బా) మధ్య విభిన్న వ్యక్తిత్వాల సంఘర్షణ ఆకట్టుకునే విధంగా ఉంటుందని టీజర్ తెలియజేస్తుంది.ముఖ్యంగా ఐపీఎల్ గురించి తరుణ్ భాస్కర్ చెప్పే కామెడీ సంభాషణ హైలైట్‌గా నిలిచింది.
ఏ ఆర్ సజీవ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతుండగా, జే క్రిష్ సంగీతం అందిస్తున్నారు. సృజన్ యరబోలు , ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రం జనవరి 23, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























