గుమ్మడి నర్సయ్య బయోపిక్ స్టార్ట్

Biopic on Gummadi Narsaiah Goes on Floors

ప్రజా నాయకుడు , మాజీ ఎమ్మెల్యే  గుమ్మడి నర్సయ్య జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా గుమ్మడి నర్సయ్య. ఇందులో  కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, పరమేశ్వర్ హివ్రాలే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్. సురేష్ రెడ్డి ప్రవళ్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు, రెగ్యులర్ షూటింగ్ ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది.ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముహూర్త షాట్‌కు కెమెరా స్విచ్‌ ఆన్ చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత సహా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  శివరాజ్‌కుమార్ ఈ వేదికపై తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ, గుమ్మడి నర్సయ్యలో తన తండ్రిని చూశానని, ఆయన జీవిత చరిత్రలో నటించడం తనకు గర్వకారణమని చెప్పారు. ఈ సినిమాకు తానే స్వయంగా తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెబుతానని ప్రకటించారు. నిబద్ధత, నిజాయితీ, సేవాభావం ఉన్న నర్సయ్య జీవితం రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

గుమ్మడి నర్సయ్య కథను దేశమంతా చూడాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో  విడుదల చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లలో, శివ రాజ్‌కుమార్ భూజానికి సంచి, చేతిలో సైకిల్, సుత్తి-కొడవలి జెండాతో కూడిన సాధారణ గెటప్‌లో గుమ్మడి నర్సయ్య పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేసినట్టు కనిపిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.