నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన మచ్ అవైటెడ్ సీక్వెల్ అఖండ 2 ఈనెల 5న విడుదలకావల్సిన ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే.అయితే నిన్న రాత్రిలోగా నైనా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.కానీ అదికూడా కుదరలేదు. ఇక ఈ సినిమా విడుదల గురించి నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.అఖండ 2 విడుదల కోసం మేము మా శాయశక్తులా కృషి చేశాం. అయితే ఎంత ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. కొన్నిసార్లు ఊహించని విషయాలు చోటుచేసుకుంటాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం విడుదల కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నఅభిమానులకు, సినిమా ప్రేమికులకు మా క్షమాపణలు.ఈ కఠిన పరిస్థితుల్లో తమకు అండగా నిలిచిన హీరో నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు బోయపాటి శ్రీనుకు చిత్ర నిర్మాణ సంస్థ ధన్యవాదాలు తెలిపింది.సినిమా కొత్త విడుదల తేదీ వివరాలను అతి త్వరలోనే ప్రకటిస్తామని సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.
ఇక ఈసినిమాను వీలైతే డిసెంబర్ 12న లేదా 25న రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.తమన్ ఈసినిమాకు సంగీతం అందించగా సంయుక్త హీరోయిన్ గా నటించింది.హర్షాలి మల్హోత్రా,ఆది పినిశెట్టి కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























