గత నెలలో ఒకే రోజు థియేటర్లలో విడుదలైన 3 సినిమాలు ఈరోజు ఓటీటీల్లోకి వచ్చేశాయి. అందులో ది గర్ల్ ఫ్రెండ్ , ది ప్రీ వెడ్డింగ్ షో , జటాధరా సినిమాలు వున్నాయి. స్టార్ హీరోయిన్ రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ ను రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా గత నెలలో 7న థియేటర్లోకి వచ్చి 30కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక ఈరోజు నుండి ఈసినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ , తమిళ ,హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే ది ప్రీ వెడ్డింగ్ షో కూడా ఓటీటీలోకి వచ్చేసింది.తిరువీర్ హీరోగా నటించిన ఈసినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ అనిపించుకుంది. కామెడీ ప్రధానంగా రాహుల్ శ్రీనివాస్ తెరకెక్కించాడు.జీ 5 ఈసినిమాను ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.
ఇక అలాగే సుదీర్ బాబు నటించిన థ్రిల్లర్ జటాధరా కూడా ఈరోజే ఓటీటీలోకి వచ్చేసింది. గత నెల 7న ఈసినిమా తెలుగు ,హిందీ భాషల్లో థియేటర్లోకి రాగ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈసినిమాను అమెజాన్ ప్రైమ్ ఈరోజు నుండి తెలుగులో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. హిందీ వెర్షన్ ఆలస్యంగా రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























