నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2: తాండవం’. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ అంచంట , గోపి ఆచంట నిర్మించారు . ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. అఖండ సినిమా చేయాలంటే చాలా బలం కావాలి. ఈ సినిమా చేసింది నేను కాదు.. ఆ శివుడే చేయించుకున్నాడు. అఖండ అనేది ఒక గుడి. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి. శివుడు రూపంలో వచ్చినప్పుడు బాలయ్య గారిని బిగ్ స్క్రీన్ పై చూస్తుంటే మీరందరూ చేతులెత్తి దండం పెడతారు. ఆది కూడా చాలా అద్భుతమైన పాత్ర చేశాడు. తనకు చాలా మంచి పేరు వస్తుంది. శివుడికి మ్యూజిక్ చేయడమనేది ఎంతో అదృష్టం ఉండాలి.ఈ డ్రీమ్ కి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ 14 రీల్స్, దూకుడు సినిమా నుంచి నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. అఖండ కంటే అఖండ 2 మూడింతలు ఎక్కువ ఉంటుంది.
బాలయ్య గారితో బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలకు పని చేయడం.. ఎంతో అదృష్టం ఉంటే గాని జరగదు. ఇప్పుడు గోపి సినిమా కూడా ప్రారంభమైంది. ఇది సిక్సర్. డిసెంబర్ 5న ఎవరు కూడా బాక్సులు పగిలిపోయి, స్పీకర్లు పేలిపోయాయని కంప్లైంట్ చేయకూడదు. ముందే మీ స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి. బోయపాటి గారు నిజంగా అలాంటి సినిమా తీశారు.డిసెంబర్ 5 బాలయ్య గారితో మరో బ్లాక్ బస్టర్ హిట్. అందరం సక్సెస్ మీట్ లో కలుద్దాం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























