అఖండ 2 చూసి సెన్సార్ వాళ్ళు ఒక్కటే చెప్పారు – బోయపాటి శ్రీనివాస్

Here’s What the Censors Said About Akhanda 2, Reveals Boyapati Sreenu

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా  ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన ఈ వేడుక అద్భుతంగా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ… ఈ వేడుకల్లో పాల్గొన్న పెద్ద వాళ్ళందరికీ, సోదర సమానులైన నందమూరి అభిమానులకు సినీ అభిమానులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి కారణంగానే సినిమా అద్భుతంగా షూటింగ్ చేసుకోగలిగాం. ఈ సినిమాలో నటించిన ప్రతి నటీనటులకు కృతజ్ఞతలు. బాలయ్య గారే మా ఆస్తి బాలయ్య గారు మా పవర్ ఆయనే మా ధైర్యం. సంయుక్త ఆదిపనిశెట్టి మురళీమోహన్ గారు హర్షాలి అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఇప్పుడే సెన్సార్ నుంచి వచ్చాను. సినిమాకి యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సభ్యులు చాలా గౌరవంగా అభినందించారు. ఈ సినిమా తర్వాత మీరు గౌరవమైన స్థానంలో ఉంటారని చెప్పారు చాలా ఆనందంగా అనిపించింది. నేను ఎమోషన్ ని నమ్ముతాను. ఆ ఎమోషన్ నుంచి వచ్చే యాక్షన్ ని నమ్ముతాను. ఆ యాక్షన్ కి నాతో పాటు పనిచేసిన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అలాగే ఫ్యూచర్లో బెస్ట్ మాస్టర్ అయ్యే రాహుల్, అలాగే ఒక ఫైట్ కి రవి వర్మ గారు పనిచేశారు. కొరియోగ్రాఫర్స్ కి థాంక్యూ. నా విజన్ స్క్రీన్ మీద చూపించే కెమెరామెన్, ఆ విజన్ కి ప్రాణం పోసిన మ్యూజిక్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తనతో నాకు సరైనోడు నుంచి జర్నీ వుంది. ఈ సినిమాకి సంతోష్,రామ్ ప్రసాద్ ఇద్దరు కెమెరామెన్ గా పనిచేశారు. చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు.

పూర్ణ అద్భుతమైన ఆర్టిస్ట్. హర్షలి భజరంగ్ భాయిజాన్ తర్వాత మన సినిమానే చేసింది. తన క్యారెక్టర్ని చాలా అభిమానిస్తారు. మా నిర్మాతలు నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చారు. వారి స్వేచ్ఛ వల్లే నేను ఇంత బ్రహ్మాండంగా సినిమాను తీయగలిగాను. ఇందులో మా చిన్నబ్బాయి ఒక క్యారెక్టర్ చేశాడు తనకి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అఖండ ప్రజల్లోకి బాగా చొచ్చుకుని వెళ్లింది. తాండవం చేస్తే నిజంగా పరమేశ్వరుడే కనిపించాలి అనుకుని ఈ సినిమా ప్రారంభించాం. తీసి చూసుకున్న తర్వాత తెలిసింది అది భగవత్ కార్యక్రమమని. భగవంతుడే ఆ కార్యక్రమాన్ని మాతో చేయించాడు . ఇందులో మేము సూట్ చేసిన కొన్ని లొకేషన్స్ చూస్తే మీకు నమ్మసక్యంగా ఉండవు. ఆ భగవంతుడే మాకు దారి చూపించాడు. జన్మభూమికి యుద్ధం జన్మభూమి కోసం యుద్ధం చేసే సైనికులు అన్నిచోట్ల ఉంటారు. కానీ కర్మభూమి కోసం యుద్ధం చేసే వీరులు భారతదేశంలోనే ఉంటారు. వాళ్ళు ఉండబట్టే ఈ దేశం ముందుకు వెళుతుంది. రామాయణం భారతం భాగవతం భగవద్గీత ప్రపంచ దేశాలకు మార్గదర్శకత్వం అయినవి.

ఇలాంటి మార్గదర్శకత్వం చూపించిన దేశాన్ని ముట్టుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా.. పెహెల్గామ్ దాడిలో మన ఆడబిడ్డ నుదుటిన వున్న ధూరాన్ని ముట్టుకుంటే ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి భారతదేశంతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో మన సైనికులు చూపించారు.తొమ్మిది మిషాల్లో టార్గెట్ రీచ్ అయ్యి మూడు రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు.అది మన సైన్యం.మనందరం అభినందించాలి.క్లాప్స్ కొట్టాలి. అలా టార్గెట్ చేయడం చేరుకోవడానికి ఈ సినిమాని డిసెంబర్ 5న థియేటర్స్ లో చూస్తారు.ఈ పరిశ్రమ ఒక్కరితో కాదు అందరితో కూడుకున్నది.ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు.ఉన్నదంతా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి.వాళ్లకి మంచి చెప్పడానికి ప్రయత్నించాలి. అన్ని సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించాలి పరిశ్రమ బావుండాలి. ప్రతి సినిమాకి మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ..అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్ ప్రేక్షకులు ఈ సినిమాని ఆనందంగా చూడాలని కోరుకుంటున్నానని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.