గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు.తమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈసినిమా డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన ఈ వేడుక అద్భుతంగా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆది పినిశెట్టి మాట్లాడుతూ… అందరికి నమస్కారం నేను ఇక్కడ ఉండడానికి కారణం బోయపాటి గారు. సరైనోడు సినిమాలో నన్నుఅద్భుతమైన విలన్ పాత్రలో చూపించారు. ఈ సినిమా గురించి చెప్తున్నప్పుడు నిజంగా నేను బాలయ్య గారి పక్కన సరిపోతానా అని భావించాను.నాకు ఇంత అద్భుతమైన ఆఫర్ ఇచ్చిన బోయపాటి గారికి థాంక్యూ. మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని అద్భుతమైన కాన్వాస్ లో నిర్మించారు.అందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా పని చేసాం దీనికి కారణం బాలయ్య గారే. ఆయన చాలా పాజిటివ్ పర్సన్. ఆయనతో మళ్లీ మళ్లీ పని చేయాలని ఆశగా ఉంది.డిసెంబర్ 5న అఖండ తాండవం అందరూ థియేటర్స్ కి వచ్చేయండి.బాలయ్య గారి ఎనర్జీ బోయపాటి గారి మా మాస్, తమన్ బీజీఎమ్ తో థియేటర్లో కూర్చున్న ప్రతిక్షణం 10000 వాట్స్ కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉంటుంది. అందరం థియేటర్స్ లో కలుద్దాం.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























