నేను ఎలా ఆంధ్ర కింగ్ అవుతాననిపించింది – ఉపేంద్ర

How Could I Become the Andhra King Says Upendra

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రెస్ మీట్ లో రియల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ కథ విన్నప్పుడే థ్రిల్ అయిపోయాను. ఎమోషనల్ గా అద్భుతంగా అనిపించింది. కానీ టైటిల్ ఆంధ్ర కింగ్ అని చెప్పినప్పుడు కాస్త టెన్షన్ అనిపించింది.నేను ఎలా ఆంధ్ర కింగ్ అవుతాను అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్ర కింగ్స్. నేను కింగ్ లాగా ఫీల్ అవుతున్నాను అంటే అది మీ గొప్పతనం. అంత పెద్ద మనసు మీది. నేను గత 25 ఏళ్లుగా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఇది నా ప్లేస్ అనిపిస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ లో ఫస్ట్ టైం వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. డైరెక్టర్ మహేష్ గారు అద్భుతమైన సినిమా తీశారు. హీరో ఫ్యాన్ మధ్య వున్న డివైన్ ఎమోషన్ ని అద్భుతంగా చూపించారు. నా ఫ్యాన్ సాగర్(రామ్) మహాలక్ష్మి(భాగ్యశ్రీ) అమెరికాలో సినిమా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఫ్యాన్ ని అక్కడ పెట్టారు(నవ్వుతూ). సినిమాకి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.