ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవం. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర అమెరికా, కెనడాలో విడుదల చేయనున్నారు. ఈ రోజు మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కింగ్ నాగార్జున ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీరిలీజ్ ఈవెంట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. గత వైభవం సినిమా గురించి ఆషికా చెబుతూనే ఉంది. తను ఈవెంట్ కి రావాలని అడగడం, నేను వచ్చేయడం వెంటనే జరిగిపోయాయి. నాకు గత జన్మల సినిమాలంటే చాలా ఇష్టం. నాన్నగారి సినిమా మూగమనసులతో నాకు బాగా పరిచయం. నేను అదే ఇష్టంతో జానకి రాముడు సినిమా చేశాను.
రెండు సినిమాలు చాలా సూపర్ హిట్ అయ్యాయి.గత జన్మలు అనేది మన కల్చర్ లో ఉండిపోయిన ఒక కథ. మనం చిన్నప్పుడు నుంచి వింటుంటాం. గత వైభవం నాలుగు జనరేషన్ల కథ, ట్రైలర్ చూస్తుంటే ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. దుష్యంత్ స్క్రీన్ మీద ఫెంటాస్టిక్ గా కనిపిస్తున్నాడు. ఆషికా అద్భుతమైన నటి. ఈ సినిమా కోసం ఇద్దరు చాలా కష్టపడ్డారు. ఈ సినిమా బాగా ఆడాలి. హనుమాన్ లాంటి సినిమాను అందించిన చైతన్య గారు ఈ సినిమాని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























