12A రైల్వే కాలనీ ట్రైలర్ రిలీజ్

12A Railway Colony Trailer Released

బచ్చలమల్లి తరువాత అల్లరి నరేష్ నటించిన సినిమా 12ఏ రైల్వే కాలనీ.హారర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది .పొలిమేర, పొలిమేర 2 ఫేమ్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్, ఈసినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా ఈ చిత్రాన్నిప్రఖ్యాత నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. నవంబర్ 21న 12ఏ రైల్వే కాలనీ థియేటర్లలోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.కన్నొదిలి కలవొదిలి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈరోజు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంది.

నాని కసరగడ్డ ఈసినిమాను చేస్తుండగా కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించింది. సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు., భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.మరి ఈసినిమాతో నరేష్ హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడో చూడాలి.

ఇక అల్లరి నరేష్ ప్రస్తుతం మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నాడు. అందులో ఆల్కహాల్ ఒకటి .మెహర్ తేజ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈసినిమాతోపాటు నరేష్ హాస్య మూవీస్ ,అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లలో కూడా సినిమా చేస్తున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.