మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సెన్సేషన్ సృష్టిస్తుంది. పాట విడుదలైనప్పటి నుండి అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కొత్త రికార్డ్స్ నెలకొల్పుతోంది.ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన చికిరి చికిరి ఎమోషన్స్, మాస్ అప్పీల్ తో చేసే ఆడియో-విజువల్ ఫీస్ట్ గా నిలిచింది. బాలాజీ అద్భుతమైన సాహిత్యం, మోహిత్ చౌహాన్ మ్యాజికల్ వోకల్స్ తో సాంగ్ దేశంలోని ప్రతి మూల నుండి ప్రేక్షకులకు ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యింది. రామ్ చరణ్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ తో చికిరి వైరల్ తుఫాను గా మారింది. రూరల్ బీట్స్, ఎనర్జిటిక్ మ్యూజిక్, అద్భుతమైన విజువల్స్, రామ్ చరణ్ మాస్ ఇమేజ్ తో చికిరి చికిరి పాట అదిరిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేశవ్యాప్తంగా ఈ పాట టాప్ చార్ట్స్‌లో నెంబర్ 1 స్థానం దక్కించుకుంది. నాలుగు భాషల్లో కలిపి 53 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించింది. అంతకుముందు 13 గంటల్లోనే 32 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియా రికార్డు క్రియేట్ చేసింది. దాదాపు మిలియన్ లైక్స్‌తో అభిమానుల ప్రేమని అందుకుంది.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, డాన్స్ చాలెంజ్‌లు, ఫ్యాన్ ఎడిట్స్.. ఎక్కడ చూసినా చికిరి చికిరి మ్యూజిక్ ఫీవర్‌నే కనిపిస్తోంది. రామ్ చరణ్ మాస్ మాగ్నటిజం, ఏఆర్.రహ్మాన్ మ్యూజిక్ మ్యాజిక్ కలసి భాషా, ప్రాంతీయ హద్దులు దాటి ఓ మ్యూజికల్ ఫెనామెనాన్‌గా మారాయి.
డైరెక్టర్ బుచ్చి బాబు సాన తన మ్యూజిక్ సెన్సిబిలిటీస్, విజువల్ సెన్స్‌ను ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతంగా చూపించారు. వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమా బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పెద్ది 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























