ప్రముఖ కవి, సినీ గీత రచయిత అందెశ్రీ ( 64) నిన్న అనారోగ్యంతో కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి లాలాగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందెశ్రీ 1961, జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా, మద్దూరు మండలం, రేబర్తి గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లన్న.అశువుగా కవిత్వం చెప్పడంలో దిట్టగా పేరుగాంచిన అందెశ్రీ.. ప్రజాకవి, ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను జాగృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.ఆయన రచించిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తించింది.
2006లో ‘గంగ’ సినిమాకు గాను నంది పురస్కారం అందుకున్నారు. 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం మరియు లోక్‌నాయక్ పురస్కారం అందుకున్నారు.ఆయన మృతి పట్ల తెలంగాణ సాహితీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























