కాంత సెన్సార్ కంప్లీట్

Kaantha Successfully Completes Censor Formalities

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, రానా దగ్గుబాటి నిర్మాణ భాగస్వామ్యంలో వస్తున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘కాంత’ సెన్సార్‌తో సహా ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.ఈసినిమాకు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేయగా రన్ టైం కూడా రివీల్ అయ్యింది.2 గంటల 43 నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది ఈసినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ట్రైలర్‌ను నవంబర్ 6 విడుదలచేయనున్నారు.ఈ సినిమా 1950ల నాటి సినిమా నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించబడింది.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి. మరి ఈసినిమాతో దుల్కర్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.

ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా, సముద్రఖని ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ‘ది హంట్ ఫర్ వీరప్పన్’ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రానా దగ్గుబాటి మరియు దుల్కర్ సల్మాన్ తమ బ్యానర్ల ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమాను నవంబర్ 14, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.