ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. కేవలం సాంగ్స్ తోనే ఈసినిమా సూపర్ హైప్ తెచ్చుకుంటుంది. రీసెంట్ గా విడుదలైన మూడో పాట ఏకంగా కేవలం 3రోజుల్లోనే 20మిళియన్లకుపైగా వ్యూస్ ను రాబట్టుకొని చార్ట్ బస్టర్ అనిపించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. చివరి పాట చిత్రీకరణతో సినిమా నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో హైదరాబాద్‌లోని సెట్‌లో రామ్, భాగ్యశ్రీ బోర్సేపై దీనిని చిత్రీకరించారు.ఈ సందర్భంగా హీరో రామ్ ఒక స్పెషల్ నోట్ షేర్ చేశారు. ” షూటింగ్ పూర్తయింది. నేను గర్వపడే సినిమా… మనమందరం గర్వపడే సినిమా..! నా కెరీర్‌లో ఈ అందమైన సినిమా ఇచ్చిన మహేష్ కి ధన్యవాదాలు. నవంబర్ 28న ఆంధ్ర కింగ్ తాలూకా మీ ముందుకు వస్తోంది’.అని రామ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
షూటింగ్ పూర్తికావడంతో సినిమా టీం అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషనల్ క్యాంపైన్‌పై ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర స్టార్ హీరోగా కనిపించనున్నారు. రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.వివేక్ & మర్విన్ సంగీతం అందిస్తుండగా, సిద్ధార్థ నూని సినిమాటోగ్రఫ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు.‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది.కుదిరితే ఒక రోజు ముందుగానే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























