ప్రేమంటే టీజర్ రిలీజ్

Premante Teaser Out Now

స్ట్రాంగ్ కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్న ప్రియదర్శి రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే తో రాబోతున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ గారికి ట్రిబ్యుట్ గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ను ఈ రోజు లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టీజర్‌లో కొత్త పెళ్లి జంట జీవితంలోని సరదా, ప్రేమ, గిల్లికజ్జాల మేళవింపు హిలేరియస్ గా చూపించారు. పెళ్లి తర్వాత కలల ప్రపంచంలో ఊహించిన ప్రేమకథ, వాస్తవ జీవితంలోని చిన్న చిన్న సమస్యలతో ఎలా మలుపులు తిరుగుతుందో ఆకట్టుకునేలా ప్రజెంట్ చేశారు. ప్రియదర్శి, ఆనంది జంటగా కనిపించి, కొత్త దంపతుల జీవితంలో జరిగే సన్నివేశాలని అలరించేలా చూపించారు. సుమ కనకాల పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా ఎంట్రీ ఇవ్వడంతో కథలో కొత్త మలుపు వస్తుంది. ఆమె పాత్ర హ్యుమర్ ని మరింత ఎలివేట్ చేసింది.

డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ ఈ చిత్రాన్ని సిట్యువేషనల్ హ్యుమర్, మనసుని హత్తుకునే ఎమోషన్స్ తో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ప్రేమంటే అనే టైటిల్‌కు తగ్గట్లుగానే, ప్రేమలోని కలలు, వాస్తవాల మధ్య తేడాను చూపిస్తూ టీజర్‌ ప్రేక్షకులను ఇన్స్టంట్ గా కనెక్ట్‌ అయ్యింది.ప్రియదర్శి–ఆనంది జంట మధ్య కెమిస్ట్రీ సహజంగా, చూడముచ్చటగా వుంది. సుమ కనకాల ప్రజెన్స్ కట్టిపడేసింది. వెన్నెల కిషోర్ తన సిగ్నేచర్ టచ్‌తో నవ్వులు పంచారు.టీజర్ అయితే చాలా బాగా కట్ చేశారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.