పరాశక్తి ఫస్ట్ సింగిల్ రానుంది

Parasakthi First Single Coming Soon

మదరాసి తరువాత తమిళ హీరో శివ కార్తికేయన్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా పరాశక్తి. శివ కార్తికేయన్ కు ఇది 25వ సినిమా.ఈ ల్యాండ్ మార్క్ మూవీ ని ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర డైరెక్ట్ చేస్తుండగా అథర్వ , శ్రీలీల ,రవి మోహన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.శ్రీ లీల కి కోలీవుడ్ లో ఇదే మొదటి సినిమా.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయడనికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే వారం లో ఈ సాంగ్ విడుదలకానుంది. 1990 బ్యాక్ డ్రాప్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు.జనవరి 14న పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. అయితే పొంగల్ కు దళపతి విజయ్ జన నాయగన్ కూడా విడుదలవుతుండడంతో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇంట్రస్టింగ్ క్లాష్ జరుగనుంది.

ఇక పరాశక్తి కి తెలుగులో కూడా భారీ పోటీ ఎదురుకానుంది. సంక్రాంతి టార్గెట్ గా టాలీవుడ్ నుండి ఏకంగా 4సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. అందులో రెండు పెద్ద సినిమాలు కూడా వున్నాయి. దాంతో పరాశక్తి కి తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.