డెకాయిట్ రిలీజ్ డేట్ ఫిక్స్

Dacoit Release Date Locked

యంగ్ హీరో అడివి శేష్ నుండి నెక్స్ట్ వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ డెకాయిట్. లీడ్ క్యారెక్టర్స్ ని పరిచయం చేసిన ఫైర్ గ్లింప్స్ రిలీజ్ తో ఈసినిమాకు హ్యుజ్ బజ్ క్రియేట్ అయ్యింది. ప్రేమ-ప్రతీకార కథనం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ మారింది. నిజానికి డిసెంబర్ లో రావల్సిన ఈసినిమా వెనక్కి వెళ్ళిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మేకర్స్ తాజాగా డెకాయిట్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. 2026 ఉగాది కానుకగా మార్చి 19న ఈ సినిమా విడుదల కానుంది. అడివి శేష్, మృణాల్‌ ఠాకూర్‌ ఇంటెన్స్ లుక్స్ లో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. ఇప్పటికే విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్‌ విజువల్స్ తో ఆకట్టుకుంది. నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజువల్ గా ఫైర్ గ్లింప్స్ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు,నటుడు అనురాగ్‌ కశ్యప్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన నటిస్తున్న తొలి తెలుగు చిత్రం డెకాయిట్ కావడం విశేషం.అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ భారీ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాత. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు వారం రోజుల తరువాత ది ప్యారడైజ్ , పెద్ది సినిమాలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు వున్నాయి. దాంతో డెకాయిట్ పోటీలో నిలబడి పెద్ద రిస్క్ చేస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.