క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు , హిందీ ల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న ఈ నటి, ఇప్పుడు ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ తాజాగా ట్రైలర్ ను కూడా విడుదలచేశారు. ఇక ఈ ట్రైలర్ ను ఎమోషనల్ టచ్ తో ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గా అనిపించి సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రొమాంటిక్ డ్రామాగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న సరసన దీక్షిత్ శెట్టి హీరోగా నటించగా అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను నవంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక సికందర్ తరువాత రష్మిక నటించిన హిందీ చిత్రం తామా రీసెంట్ గా విడుదలై యావరేజ్ రన్ ను కొనసాగిస్తోంది. మరి ది గర్ల్ ఫ్రెండ్ రష్మిక కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























